దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మళ్లీరావా, జెర్సీ వంటి ప్రేమ కథలను చిత్రాలను తెరపై ఎంత అందంగా చూపించగలడో నిరూపించుకున్నడు . తీసింది రెండు సినిమాలే అయినా.. వాటి వల్ల వచ్చిన గుర్తింపు బాలీవుడ్ వరకు పాకింది. అందుకే జెర్సీ హిందీ రీమేక్ సైతం గౌతమ్ తెరకెక్కిస్తున్నాడు. అలా ఈ యంగ్ డైరెక్టర్ రేంజ్ మారిపోయింది. తాజాగా ఈ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే రామ్ చరణ్- గౌతమ్ మధ్య ఎన్వీ ప్రసాద్ ఓ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారట. ఈ సమావేశం తర్వాత ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా ప్రారంభం కానుందని టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, అలియా భట్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్‌లు కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa