ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాల్ 'అభిమన్యుడు' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 06, 2018, 11:39 AM

తెలుగు .. తమిళ భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమైన 'ఇరుంబుతిరై' .. తెలుగులో 'అభిమన్యుడు' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను వదిలారు. సినిమా భారీ తనానికి ఈ టీజర్ అద్దం పడుతోంది.





పెరుగుతోన్న టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని, జనం జీవితాలను కొంతమంది ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని ఈ టీజర్ చెబుతోంది. "ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు .. నీ గురించిన ఓ చిన్న ఇన్ఫర్మేషన్ చాలు" అనే డైలాగ్ అందుకు నిదర్శనం. ఆర్మీ ఆఫీసర్ గా విశాల్ ఫైట్స్ .. విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ వ్యూహాలతో ఈ టీజర్ దుమ్మురేపేస్తోంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, రెండు భాషల్లోను త్వరలోనే విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa