మంచు విష్ణు - జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించగా ఇప్పుడు ఈ కాంబో హ్యట్రిక్ పై కన్నేసింది. పద్మజ పిక్చర్స్ బేనర్ పై కీర్తి చౌదరి నిర్మిస్తున్న ఆచారి అమెరికా యాత్ర చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బ్రహ్మనందం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢీ చిత్రంలో విష్ణు, బ్రహ్మీ మధ్య సంభాషణలకు ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలోను మరోసారి ఈ కామెడీని రిపీట్ చేయనున్నట్టు సమాచారం. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఇందులో సన్నివేశాలు చిత్రంపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి మీరు ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa