తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా వెబ్ సీరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'ఆహా' ఓటీటీ కోసం తొమ్మిది విభిన్న ప్రేమకథల్ని వెబ్ సీరీస్ గా రూపొందించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. . పుష్ప సినిమా కోసం సుకుమార్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చాలా పరిశోధన చేసిందట. అయితే రెండున్నర గంటల సినిమాలో ఇవన్నీ చర్చించడం వీలు కాదని భావించిన సుకుమార్.. వెబ్ సిరీస్ అయితే పూర్తిగా వివరించవచ్చని ఆలోచన చేసి ఆ వైపుగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందట. దాంతో పాటు సుకుమార్ 'ఆహా' ఓటీటీ కోసం మరోక కథను రెడీ చేశాడట. అంతేకాదు ఆ కథలో తొమ్మిది విభిన్న ప్రేమకథలుంటాయట. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa