రామ్ తో కొంతకాలంగా సక్సెస్ దాగుడుమూతలాడుతోంది. దాంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడు. అందువల్లనే చాలా కథలు విన్న ఆయన , దర్శకుడు త్రినాథరావు నక్కినకు పచ్చజెండా ఊపాడు. దాంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.
దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా మేఘా ఆకాశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ అమ్మాయి నితిన్ జోడీగా 'లై' చేసింది .. త్వరలో 'ఛల్ మోహన్ రంగ'తో పలకరించనుంది. ఇంతకుముందే ఈ అమ్మాయి రామ్ తో కలిసి 'ఉన్నది ఒకటే జిందగీ ' చేయవలసింది గానీ కుదరలేదు. ఇప్పుడు డేట్స్ కుదరడంతో ఓకే చెప్పేసిందట. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa