సీనియర్ నటుడు జగపతి బాబు దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి అయిన బుర్జ్ ఖలీఫా దగ్గర ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన షాపింగ్ వస్తువులను పక్కనబెట్టి ఫొటోకు పోజిచ్చాడు. 'డబ్బులు లేకపోతే ఒక గోల.. ఉంటే ఒక గోల' అని క్యాప్షన్ పెట్టాడు. ఒకప్పుడు హీరోగా ఎదిగిన జగ్గూ భాయ్ లెజెండ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి, కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన పోస్ట్‌కు డబ్బులు ఎక్కువగా ఉంటే మాకు ఇవ్వండి అంటూ నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’తో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు జగపతిబాబు. ఈ సినిమా సక్సెస్ కావడంతో తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కన్నడంలో ఉపేంద్రతో ‘కబ్జా’ సినిమా చేస్తున్నారాయన. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa