ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే ఓటిటీలో స్ట్రీమింగ్ కానున్న ‘భీమ్లానాయక్’

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 07:10 PM

ఫిబ్రవరి 25న విడుదలైన ‘భీమ్లానాయక్’ బ్లాక్ బస్టర్‍గా నిలిచింది. 2 రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘భీమ్లానాయక్’ డిజిటల్ రైట్స్ అత్యధిక ధరకు తీసుకున్నట్లు టాక్. మార్చి నెలాఖరులో స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. హాట్‌స్టార్‍లో స్ట్రీమ్ అయ్యాక ఆహాలో కూడా స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు  డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా సంస్థలు ఇందుకోసం భారీ ధరను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేం సాగర్‌ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. థమన్‌ అందించిన పాటలు ఇప్పటికే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa