బుల్లితెరపై ప్రస్తుతం ఉన్నటాప్ యాంకర్లలో శ్యామల ఒకరు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది శ్యామల. మూవీస్, షోస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే శ్యామల ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‍గా ఉంటుంది. ఓవైపు యూట్యూబ్‌లో ఛానల్ నిర్వహిస్తూనే మరోవైపు ఇన్‌స్టాలో ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాలో తన ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించింది శ్యామల. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెప్పింది. ఇక లైవ్‌చాట్‌లో యాంకర్ శ్యామలను నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు. అందుకు శ్యామల తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. ఇక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నో కామెంట్స్ కానీ ఆయన గొప్ప దర్శకుడు ఒకప్పుడు ఆయన చిత్రాలకు పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. శ్యామల ఇచ్చిన ఆన్సర్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ యాంకర్ శ్యామలపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.