ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ సరసన కృతిశెట్టి?

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 04:41 PM

ఉప్పెన తో మొదటి సినిమా తోనే భారీ హిట్ సొంతం చేసుకుంది కృతి. ఈ సినిమాలో బేబమ్మగా తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరవాత చేసిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాలందుకున్నాయి. దీంతో వరస అవకాశాలందుకుంటుంది కృతి. ఇప్పటికే రామ్ "డి వారియర్", సుధీర్ బాబు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", నితిన్ "మాచర్ల నియోజక వర్గం" సినిమాలతో డైరీ నిండిపోగా మరో కొత్త అవకాశన్ని చేజిక్కించుకుంది కృతి. అది కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మహేష్ తన 28వ సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్నారన్న విషయం విదితమే.ఈ సినిమా కోసం కృతిని సంప్రదించారట చిత్రబృందం. అయితే ఈ సినిమాలో రెండో సారి మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మహేష్ సరసన కృతి నటిస్తున్నదన్న వార్తలో ఎంత నిజమున్నదన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa