కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' మార్చి 17,2022న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు.చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ప్రియా ఆనంద్ కనిపించనుంది.ఈ చిత్రాన్ని కిషోర్ పత్తికొండ నిర్మించారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా 149నిమిషాల రన్‌టైమ్‌ని కలిగి ఉంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.ప్రపంచవ్యాప్తంగా 4000కు పైగా స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను నటుడు శ్రీకాంత్ అండ్ విజయ్ ఎం సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa