యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తుంది.వన్మయే క్రియేషన్స్ అండ్ విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు.కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'దస్ కా ధుమ్కీ' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.మేకర్స్ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయాగా,టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది.'దాస్ కా ధుమ్కీ' రెగ్యులర్ షూట్ ఈ నెల 14న ప్రారంభమవుతుంది అని మేకర్స్ వెల్లడించారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa