సౌత్ ఇండియన్ టాప్ యాక్ట్రెస్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కరు అని చెప్పొచ్చు.తెలుగు అండ్ తమిళ ఫిలింఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.కొన్ని సంవత్సరాల క్రితం,నిర్మాత కుంజుమోన్ 1993లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ 'జెంటిల్‌మన్'కి సీక్వెల్‌ను ప్రకటించారు.'జెంటిల్‌మన్ 2'లో MM కీరవాణిని సంగీత దర్శకుడిగా ప్రకటించారు.తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేసినట్లు ఫిలింఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి మేకర్స్ ఆఫీసియల్ గా ఏమి అనౌన్స్ చేయలేదు.ప్రస్తుతం నయనతార టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa