టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒక్కరైనా అనిల్ రావిపూడి 'RRR' మూవీ ప్రొమోషన్స్ టైమ్ లో రాజమౌళి, రామ్‌చరణ్ అండ్ తారక్‌లను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తారక్ - అనిల్ కామెడీ సెన్స్ అండ్ పంచ్‌ల టైమింగ్ బాగుంది. ఈ కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని అందరూ ఆశించారు. తాజాగా ఈ కాంబినేషన్ ఓకే అయిందని లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాని గురించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa