ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో 'ఆచార్య' డే 2 కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 12:41 PM

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల నుండి మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. 'ఆచార్య' సినిమా మంచి ఆక్యుపెన్సీని తో మొదలయింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, నైజాంలో ఈ సినిమా రెండో రోజు 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో నైజాంలో ఈ సినిమా 2 రోజులలో 10 కోట్లు రాబటింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజాహెడ్గే జంటగా నటించనుంది. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa