ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేజర్వైవిధ్యభరితంగా అడవిశేష్ మేజర్ ట్రైలర్ గ్లిమ్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 01:14 PM

2008 ముంబై  దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేజర్'. టైటిల్ రోల్ లో అడవి శేష్ నటిస్తుండటమే కాక ఈ చిత్రానికి కథను కూడా అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, తమిళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అడవి శేష్ పాన్ ఇండియా బరిలోకి అడుగు పెట్టనున్నారు. మే 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 3కు వాయిదా పడిన విషయం తెలిసిందే. 


తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ గ్లిమ్స్ ను విడుదల చేసారు చిత్రబృందం. హిందీ, తెలుగు రెండు భాషలలో గ్లిమ్స్ ను ఒకే వీడియో లో విడుదల చెయ్యటం విశేషం. వైవిధ్యభరితమైన ఎమోషన్స్ తో సాగిన ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ గ్లిమ్స్ కు ఉత్తరాది వారి నుండి ప్రశంసలు అందుతున్నాయి. అడవి శేష్ హిందీ ప్రేక్షకులకు తెలియకపోయినా, యూనివర్సల్ మూవీ సబ్జెక్టు కాబట్టి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ మూవీని చూసి ఎమోషన్ కు గురవుతారు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయమని చిత్రబృందం ఎంతో నమ్మకంగా ఉంది.  సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్టుతో నిర్మించబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa