పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబు సినిమా చేయనున్నారు. అది పూర్తైన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత కే.విజయేంద్రప్రసాద్ ఈ సినిమాపై స్పందించారు. 2022 జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు.
మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి మహేష్ బాబు కూడా స్పందించారు. రాజమౌళితో కలిసి పని చేయడానికి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa