ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందితా శ్వేత కథానాయికగా 'ప్రేమకథా చిత్రం 2'

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 02, 2018, 03:29 PM

హారర్ కామెడీ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగా 'ప్రేమకథా చిత్రం' కనిపిస్తుంది. సుధీర్ బాబు .. నందిత జంటగా నటించిన ఈ సినిమా 2013లో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాకి, 'ప్రేమకథా చిత్రం 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు.


సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన నందితా శ్వేతను తీసుకున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో, దెయ్యం పాత్రలో అదరగొట్టేసిన కారణంగానే ఈ అమ్మాయికి ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలోనూ ఈ అమ్మాయి నటన హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. రీసెంట్ గా మొదటి షెడ్యూలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ నెల రెండవ వారం నుంచి రెండవ షెడ్యూల్ ను ఆరంభించనుంది. 'జంబ లకిడి పంబ' ఫేమ్ సిద్ధి ఇద్నాని ఈ సినిమాలో మరో కథానాయికగా నటిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa