ట్రెండీలు, జెనీలియా హా. హా.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది జెనీలియా. బొమ్మరిల్లు' సినిమాలో హాసిని పాత్రకు ప్రాణం పోసింది. సై డి. రెడి, హ్యాపీ సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇక రితీష్ దేశ్ ముఖ్ తో పెళ్లి.. పిల్లలు పుట్టడంతో సంసార జీవితంలో బిజీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. మునుప టిలా నాజుగ్గా మారింది. సన్నబడిన అందాలతో ట్రెండీ లుక్ లో దర్శనమిస్తోంది. రోజు డ్రెస్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. మొన్న ఎల్లో, నిన్న గ్రీన్ కలర్ ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంది. దీంతో హాసిని ఈజ్ బ్యాక్ అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Vibrant Angel @geneliad #GeneliaDeshmukh #ActressesDuniya pic.twitter.com/Z20Vu7g2dv
— Beautiful Angels (@actressesduniya) June 7, 2022