2009లో AR రెహ్మాన్ సంగీతం అందించిన "స్లమ్ డాగ్ మిలియనీర్" కు సౌంగ్ మిక్సర్ గా పని చేసారు ఇంజినీర్ రసూల్ పూకుట్టి. ఆ సినిమాకుగాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహ్మాన్ ఆస్కార్ అవార్డు అందుకోగా, బెస్ట్ సౌండ్ మిక్సర్ గా రసూల్ పూకుట్టి కూడా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. హిందీ, తమిళం, మలయాళం,తెలుగు సినిమాలకు సౌండ్ ఇంజినీర్ గా పని చేసే రసూల్, ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాను "గే లవ్ స్టోరీ" గా అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యల పట్ల రసూల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో రసూల్ కు వ్యతిరేకంగా చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. దేశ ప్రజలు మెచ్చిన సినిమా, విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకుంటున్న సినిమాను ఒక భారతీయుడైయుండి రసూల్ "గే లవ్ స్టోరీ" అని చీప్ కామెంట్ చెయ్యడం పట్ల ఆర్ ఆర్ ఆర్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో రసూల్ ను ఒక రేంజులో ట్రోలింగ్ చేస్తున్నారు. మరి తాను చేసిన వ్యాఖ్యల పట్ల రసూల్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విచిత్రం.