సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ‘గుర్తుందా శీతాకాలం’ మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తామని ఆ మధ్య చిత్రబృందం ప్రకటించింది. అయితే సోమవారం సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ మూవీని ఆగస్ట్ 5న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.