టాలీవుడ్ బుట్టబొమ్మగా ఫేమస్ ఐన డస్కీ సైరెన్ పూజాహెగ్డే "మూగమూడి" అనే తమిళ సినిమాతో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. మిస్సికిన్ దర్శకత్వంలో జీవా హీరోగా నటించిన ఆ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. పూజా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి దాదాపు పదేళ్లు కావస్తున్నా కోలీవుడ్ లో మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఇటీవల "బీస్ట్" తో రీఎంట్రీ ని గట్టిగానే ప్లాన్ చేసినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బోల్తా కొట్టడంతో పూజా కోలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.
తాజాగా మరోసారి పూజా కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ను పూజ కొట్టేసిందని టాక్. 'విశ్వాసం' ఫేమ్ శివ డైరెక్షన్లో హీరో సూర్య లీడ్ రోల్ పోషిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా పూజా ను సెలెక్ట్ చేసారని వినికిడి. ఐతే, దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ ఈ వార్త నిజమైతే, కోలీవుడ్ లో తన సత్తా చాటేందుకు పూజకు మరో బంపరాఫర్ దక్కినట్టే.
![]() |
![]() |