కోలీవుడ్ సీనియర్ హీరో ఆర్. మాధవన్ ఇటీవలే తన తొలి డిబట్ డైరెక్టోరియల్ "రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్" తో ప్రేక్షకులను పలకరించారు. జూలై 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతుంది.
రాకెట్రి ప్రొమోషన్స్ లో భాగంగా హీరో సూర్యతో జరిగిన ఒక ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో మాధవన్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 2005లో ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "గజినీ" సినిమాలో నిజానికి లీడ్ రోల్ లో తాను నటించాల్సి ఉందని మాధవన్ చెప్పారు. అంతేకాక గజిని పాత్రకోసం సూర్య వారం రోజుల పాటు తన ఆహారంలో ఉప్పును తీసుకోకుండా ఉన్నారని చెప్పారు. గజినీ స్క్రిప్ట్ ను మురుగదాస్ తొలుత తనకే వినిపించారని, సెకండాఫ్ నచ్చక ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నట్టు పేర్కొన్నారు. మాధవన్ రిజెక్ట్ చేసిన పాత్రలో సూర్య నటించడం, ఆ సినిమా పెద్ద హిట్టవ్వడం, హిందీలో కూడా రీమేక్ అవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయనుకోండి. సూర్య కెరీర్ లో మచ్చుతునకగా మిగిలిపోయే "గజిని"ని మాధవన్ చేసి ఉంటే ఎలా ఉండేదో..!