హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న సాయంత్రం విడుదలైన "బింబిసార" ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న తొలి హిస్టారికల్ అండ్ పాన్ ఇండియా మూవీ ఇది. వశిష్ట డైరెక్షన్లో భారతీయ చక్రవర్తి బింబిసారుడి జీవితం ఆధారంగా సోషల్ ఫాంటసి గా తెరకెక్కిన ఈ మూవీ పై తాజాగా రిలీజైన ట్రైలర్ భారీ అంచనాలను నమోదు చేసింది. ఈ ట్రైలర్ ను మెచ్చుకుంటూ పలువురు సినీ సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా బింబిసార ట్రైలర్ చాలా బాగుందంటూ ట్వీట్ చేసాడు. "ట్రైలర్ చాలా బాగుంది...ఇంటెన్స్,రా అండ్ న్యూ" అని ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కళ్యాణ్ రామ్ కు శుభాకాంక్షలను తెలియచేసారు.