తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న "సీతారామం" నుండి కొంచెంసేపటి క్రితమే బిగ్ సర్ప్రైజ్ వచ్చింది. రేపు రాత్రి ఏడింటి నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఐతే, ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? చీఫ్ గెస్ట్ లెవరు? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. వాస్తవానికి ఈ ఈవెంట్ కు డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కావలసి ఉంది., కానీ, ఆయన విదేశాల కెళ్ళడం వలన ఈ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నారని తెలుస్తుంది.
ఈ చిత్రానికి హను రాఘవపూడి డైరెక్టర్ కాగా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక మండన్నా , సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలు పోషించగా, విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa