శుక్రవారం విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ "బింబిసార" తొలి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి బింబిసార అండ్ టీం కు గ్రాండ్ సక్సెస్ పార్టీని కూడా ఎరేంజ్ చేసారు. ఈ పార్టీ అనంతరం ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాట్లాడుతూ... యాభై రోజుల తదుపరి మాత్రమే బింబిసారుడి డిజిటల్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ జీ సంస్థ బింబిసార డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది కాబట్టి ఆ ఓటిటిలోనే బింబిసార డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa