యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారాడు.. స్వంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను ఏర్పాటు చేశాడు..తనకి తొలి హిట్ ఇచ్చిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ కావడంతో, ఆ సెంటిమెంట్ తో ‘వెంకటాద్రి టాకీస్’ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళభాషల్లో ఒక సినిమా కి శ్రీకారం చుట్టాడు.. ఈ మూవీకి నిను వీడని నీడను నేను టైటిల్ ను ఖరారు చేశారు.. అన్యసింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో వెన్నెల కిషోర్ కీలకపాత్రలో నటిస్తున్నాడు..థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa