ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సంవత్సరంలో టాప్ ప్లాప్ చిత్రాలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 29, 2018, 02:27 PM

2018 సంవత్సరంలో హింది సినిమా ఇండస్ట్రీకి కొన్ని సినిమాల ద్వారా గుర్తించుకొనే లాభాలు వస్తే, కొన్ని సినిమాల ద్వారా మరిచిపోలేని నష్టాలు వచ్చాయి. అందులో పలువురు పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు, ఎన్నో అంచనాల మధ్య వచ్చినవి కూడా ఉన్నాయి. మరీ ఆ సినిమాలు ఏంటీ.. వాటీ వల్ల ఎంత నష్టం వచ్చిందో చూద్దాం !


హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ - సోనాక్షి సిన్హా, డయానా పెంటీ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం 'హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ'. ముదాసర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ జానర్‌లో రూపొందింది. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే రాబట్టింది.


పల్టాన్ -  జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్, సోనూ సూద్, హర్ష వర్దన్ రాణె ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను జేపీ దత్తా దర్శకత్వం వహించారు. యుద్ద నేపథ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బొల్తా పడింది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద రూ. 8 కోట్ల మాత్రమే రాబట్టింది.


కాలాకండి  - సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డార్క్ కామెడీ జానర్‌లో రూపొందించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అక్షత్ వర్మ.  కాలాకండిని, సినీస్థాన్ అనే ఫిల్మ్ కంపెనీ రూ. 18 కోట్లతో నిర్మించింది, అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.


ఫన్నే ఖాన్ -  ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫన్నే ఖాన్'. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రూ. 39 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా కేవలం రూ. 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


అయ్యారీ -  సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్ పాయ్, పూజా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అయ్యారీ'. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 18 కోట్లుమాత్రమే వసూలు చేసింది.


బట్టి గుల్ మీటర్ చాలు-  షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బట్టి గుల్ మీటర్ చాలు'. శ్రీనారాయణ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రూ. 49 కోట్లతో భూషణ్ కుమర్ నిర్మించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 37 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


నమస్తే ఇంగ్లాండ్ -  అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందింది. విపుల్ అమృతల్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 54 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కేవలం రూ. 10 కోట్లు కూడా రాబట్టలేక పోయింది.


రేస్ 3 -  సల్మాన్ ఖాన్, బాబీ డియోల్, అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రెమో డిసౌజా దర్శకత్వం చేశారు. యాక్షన్ జానర్‌లో రూపొందించిన ఈ సినిమాను రూ. 185 కోట్లతో రమేస్ ఎస్ తౌరానీ నిర్మించారు. అయితే.. ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.


థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ -  అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కేవలం రూ. 262 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో థగ్స్ ఆఫ్ హిందోస్తాన్, ఈ సంవత్సరానికి హింది సినీ పరిశ్రమలో నెం.1 డిజాస్టర్‌గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa