రోహిత్ బహెల్, అపర్ణా జనార్ధనన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "లవ్ యూ రామ్". ఈ సినిమాకు DY చౌదరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మన ఎంటర్టైన్మెంట్, శ్రీ చక్ర ఫిలిమ్స్ బ్యానర్లపై Dy చౌదరి, కే దశరధ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కే వేదా సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్గా ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదలై, ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను చూరగొనగా, తాజాగా టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు లవ్ యు రామ్ టీజర్ డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాతోనే దశరధ్ డైరెక్టర్ నుండి నిర్మాతగా మారనున్నారు. దశరధ్ గతంలో సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa