ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రాజమండ్రిలో "హిట్ 2" సక్సెస్ టూర్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 10:37 PM

అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ "హిట్2" సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని గారు నిర్మించడం జరిగింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడ్రోజుల్లోనే ఆల్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి, నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.


రీసెంట్గానే గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా రేపు రాజమండ్రిలో సక్సెస్ టూర్ ను నిర్వహించనుంది. రేపు ఉదయం పదింటికి ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పదకొండున్నరకు మంజీరా సరోవర్, సాయంత్రం ఆరింటికి గోదావరి హారతి ఘాట్, ఏడింటికి స్వామి థియేటర్లలో హిట్ 2 చిత్రబృందం హల్చల్ చేయనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa