సూపర్ స్టార్ రజనీకాంత్ 72వ పుట్టినరోజు సందర్భంగా 'బాబా' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శివాజీ ది బాస్' చిత్రం 2007లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాని డిసెంబర్ 9-15 మధ్య పీవీఆర్, సినీపోలీస్ చైన్‌ల థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాని తమిళం, హిందీ భాషల్లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.