యంగ్ హీరో నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలం అయ్యింది. బంగార్రాజు, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ తర్వాత మళ్లీ హిట్ రుచి చూడలేదు. ఈ క్రమంలో ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోసారి విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘దూత’ అనే వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ‘చైతన్యబాబు’ అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటివరకూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయని చైతూ.. తొలిసారి నెగిటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అప్ డేట్ రానుంది.