టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహాతో తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను ఆమె పంచుకుంటూ 'మేమిద్దరం ఒకటి కాబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి' అని ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసింది. వశిష్ట సింహా కేజీఎఫ్ లో కమల్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. హరిప్రియ తెలుగులో పిల్లజమీందార్, తకిట తకిట, గలాట, జై సింహా, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.