బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ దర్శకుడు ఆదిత్య ధర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, భామ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ”పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసింది అనుకుంటే పొరపాటే. పెళ్లి హీరోయిన్స్ కెరీర్ కి అడ్డం కాకూడదు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆ బాధ్యతల్ని కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తూ కెరీర్ ని చూసుకోవాలి. భర్త ప్రోత్సాహం ఉంటే మరింత ఉత్సాహంగా చేయొచ్చు. నా భర్త కూడా ఇదే ఫీల్డ్, కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే నేను సినిమాలు చేస్తున్నాను” అని తెలిపింది.