యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ తనకు మంచి మిత్రుడని, అంతకుమించి ఏం లేదని కృతిసనన్ స్పష్టం చేసింది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ను ప్రశంసల్లో ముంచెత్తింది. "ప్రస్తుతం నేను తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే కారణం ప్రభాసే. ఆదిపురుష్ సెట్లో ఆయన నాకు తెలుగు నేర్పించారు. దీనికి ప్రభాస్ కు థాంక్స్ చెప్పాలి. నాకు తెలుగు నేర్పించినందుకు నేను ప్రభాస్ కు హిందీ నేర్పించాను. మా ఇద్దరిపై గాసిప్స్ వచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి అందరితో స్నేహంగా ఉంటారు అని చెప్పుకొచ్చింది.