మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు ముగిశాయి. సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగాయి. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను అధికారులు తీసుకెళ్లారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప-2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ సినిమాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.