ప్రేక్షకాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చేసింది. పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన పుష్ప మూవీ పార్ట్ 2 ఈ రోజు నుండే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ గారు కూడా పాల్గొంటున్నారు. ఇక, ఎక్జయిటింగ్ అప్డేట్స్ ఏకధాటిగా వస్తూ ఉంటాయన్నమాట.
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన పుష్ప : ది రైజ్ సినిమా గతేడాది విడుదలై ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. దీంతో పుష్ప పార్ట్ 2 పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగుతో పాటు సరిసమానంగా హిందీలో కూడా పుష్ప ప్రభంజన విజయం సాధించడం విశేషం. ఎలాంటి ప్రచారం చెయ్యకుండా పుష్ప ఉత్తరాదిన వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.