అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు ఇవాళ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది. అశ్లీల కంటెంట్‌ను పంపిణీ చేశారనే ఆరోపణలపై ముంబై పోలీసులు 2020లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు రాజ్ కుంద్రా చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.