ఈ ఏడాది రౌడీ బాయ్స్, కార్తికేయ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ ఏడాదిలోనే ఆమె నుండి మరో సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే, ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు సిద్ధపడింది.
ఘంటా సతీష్ బాబు డైరెక్షన్లో థ్రిల్లర్ మూవీ గా రూపొందిన చిత్రం "బట్టర్ ఫ్లై". ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమా ట్రైలర్ కొంతసేపటి క్రితమే విడుదలైంది. చైల్డ్ కిడ్నాపింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాను జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిహాల్, సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీ రోల్స్ పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 29 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కి రాబోతుంది.