మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న ఔటండౌట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య". రవితేజ కీరోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు బాబీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శృతి హాసన్, బాబీ సింహ, క్యాథెరిన్ ట్రెసా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13, 2023లో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జనవరి 8న జరగబోతుందని టాక్. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం హైదరాబాద్ నుండి వైజాగ్ కి వాల్తేరు వీరయ్య చిత్రబృందం ఒక స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుందని టాక్. ఇప్పటివరకైతే, ఈ విషయం పై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదు కానీ, ఫ్యూచర్ లో రావచ్చేమో..! చూద్దాం..!!