సుకుమార్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మండన్నా జంటగా నటించిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఎంతటి ప్రభంజన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ కారణంగా పుష్ప పార్ట్ 2 పై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతమైతే పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా వినిపిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం, పుష్ప క్లైమాక్స్ ఎలా ఐతే పుష్ప 2 కి లీడ్ ఇచ్చిందో ..అదేవిధంగా పుష్ప 2 క్లైమాక్స్ పుష్ప 3 కి లీడ్ ఇస్తుందట. అంటే దీనర్ధం పుష్ప 2 భాగాలతో ముగిసిపోవట్లేదు ... మూడో భాగం కూడా ఉందని తెలుస్తుంది. చూస్తుంటే, పుష్ప యాజిటీజ్ KGF ఫ్రాంచైజీని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే, KGF 2 విడుదల సమయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఒకేసారి పార్ట్ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు పుష్ప దర్శకనిర్మాతలు కూడా ఇలాంటి షెడ్యూల్ నే ప్లాన్ చేస్తున్నారట. మరి, దీనిపై క్లారిటీ రావాలంటే, కొంచెం ఎక్కువ సమయమే పట్టేటట్లుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa