కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ భామ నటనకు స్వస్తి చెబుతుందని అంతా భావించారు. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్ తల్లి అయిన నాలుగు నెలలకే నటనకు సిద్ధమైంది. ఇండియన్-2 చిత్రంలో నటించేందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది. తాజాగా కాజల్ తన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఫోటోల్లో కాజల్ కాస్త బరువెక్కింది. ఇండియన్-2 లో కమల్ హాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నారు. కాజల్ బరువు పెరగడానికి, ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది.