కింగ్ నాగార్జునకు కొంత కాలంగా సరైన హిట్ లేదు. ‘సోగ్గాడే చిన్నినాయన’ తర్వాత ఆయన సోలోగా హిట్ కొట్టలేదు. ఈ నేపథ్యంలో నాగ్ తన తదుపరి చిత్రాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే ఓ యంగ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించిన ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa