పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో యంగ్ హీరోహీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా "18 పేజెస్". గత శుక్రవారం థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ తో ధియేటర్ రన్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలిరోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి.నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.
ఈ రోజు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని 18 పేజెస్ చిత్రబృందం హైదరాబాద్ లోని పలు థియేటర్లను విజిట్ చెయ్యడానికి బయలుదేరింది. ఈ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు ఎర్రగడ్డ గోకుల్ ధియేటర్ తో మొదలుపెట్టి, మూసాపేట లోని లక్ష్మీకళ, కూకట్పల్లి లోని విశ్వనాధ్, KPHB లోని నెక్సస్ మాల్, AMB సినిమాస్ థియేటర్లలో 18 పేజెస్ చిత్రబృందం హల్చల్ చేసి, ప్రేక్షకులతో ఇంటిరాక్ట్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa