హీరోగా తన తనయుడి ఎంట్రీపై ప్రముఖ నటుడు రవితేజ స్పందించారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘మీ అబ్బాయిని వచ్చే ఏడాది ఇడియట్ 2తో హీరోగా పరిచయం చేయబోతున్నారని అంతా అనుకుంటున్నారు’ అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, వినడానికే ఇది కొత్తగా ఉందని రవితేజ అన్నారు. కాగా, రవితేజ తనయుడు మహాధన్ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో బాల నటుడిగా మెరిశారు. అందులో రవితేజ చిన్నప్పటి పాత్రను పోషించారు.