కోలీవుడ్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న మూవీ 'వారిసు'. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు లిరికల్ వీడియోలు విడుదలవ్వగా, రెండూ కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఒక నెల క్రితం విడుదలైన వారిసు ఫస్ట్ లిరికల్ 'రంజితమే' 111మిలియన్ వ్యూస్ సాధించి ఇప్పటికీ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. రీసెంట్గా విడుదలైన థీ తలపతి సాంగ్ కు కూడా ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ 30మిలియన్ వ్యూస్ తోటి యూట్యూబ్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. రంజితమే సాంగ్ ను హీరో విజయ్ పాడగా, థీ తలపతి సాంగ్ ను మరో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఆలపించారు.