మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ మంగళవారంతో పూర్తైంది. ఈ క్రమంలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మంచి సినిమాలు, మంచి పాత్రలు చేయాలని మనం ఎలా ఆకలిగా ఉంటామో.. వంద, రెండొందల చిత్రాలు చేసినా అదే కమిట్ మెంట్ తో ఉండాలి. అప్పుడే మన వృత్తికి న్యాయం చేయగలం. అది లేకపోతే సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి. ఆ కమిట్ మెంట్ కు నేను కట్టుబడి ఉంటాను.. ఆచరిస్తాను. ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను’ అని అన్నారు.