వాల్తేరు వీరయ్య నుండి రీసెంట్గా విడుదలైన వీరయ్య టైటిల్ సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ లిరిక్స్ తో, క్యాచీ ట్యూన్ తో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను స్వరపరచడం జరిగింది. చంద్రబోస్ గారు అద్భుతమైన లిరిక్స్ ను అందించారు. దీంతో ఈ పాట యూట్యూబ్ లో 7 మిలియన్ కు పైగా వీక్షణలను రాబట్టి, 180 కే లైక్స్ తో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.