తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్న యంగ్ బ్యూటీ కేతికా శర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. మరోవైపు నెట్టింట గ్లామర్ విందుతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతోంది. తొలిచిత్రంతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. స్టార్ డైరెక్టర్ కొడుకు, యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన ‘రొమాంటిక్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మూవీలో కేతికా బోల్డ్ పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ మంత్రముగ్ధులయ్యారు.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ కేతికా రచ్చరంభోలా చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. యంగ్ బ్యూటీ హాట్ నెస్ కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గకుండా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.