ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో మహానటి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 05:49 PM

తెలుగు .. తమిళ భాషల్లో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయాలనగానే నయనతార .. అనుష్క పేర్లు గుర్తొస్తాయి. ఈ ఇద్దరూ అందుబాటులో లేకపోతే త్రిషను ఎంపిక చేసుకుంటారు. మిగతా సీనియర్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ కథ భుజాన వేసుకుని నడిపించడానికి వాళ్లు ధైర్యం చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కెరియర్ తొలినాళ్లలోనే 'మహానటి' సినిమా చేసి కీర్తి సురేశ్ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

ఈ సినిమా తరువాత ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఆమె చేయకపోవచ్చని అంతా అనుకున్నారు. అందుకు భిన్నంగా ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన మరో సినిమాను అంగీకరించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మించనున్న ఓ సినిమాలో కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారు. కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa