ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమా పై సోనాక్షీ సిన్హా ఆశలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 12:10 PM

గాల్లో తేలినట్లుందే…అన్నట్లు మనసు చాలా సార్లు ఉరకలేస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రపంచం పై అంచుల్లో ఉన్నామేమో అనిపిస్తుంటుంది. సోనాక్షీ సిన్హాకు ఇలాగే అనిపించింది. కారణం ఆమె నటిస్తున్న భారీ మల్టి స్టారర్‌ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోనాక్షీ సామాజిక మాధ్యమాలలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె స్పందిస్తూ…కొత్త ఏడాది ప్రారంభం…గొప్ప సినిమా ముగింపు. చాలా సంతోషంగా ఉంది. నేనే అందరికంటే పైన ఉన్నానేమో. కలంక్‌ చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది. ఈ సినిమా తెరపై చూసేందుకు ఆగలేకపోతున్నా. అని చెప్పింది. గతేడాది మూడు చిత్రాల్లో నటించింది సోనాక్షీ. ఆ మూడు విజయానికి దూరంగానే ఉండిపోయాయి. అయితే ఈ ఏడాదిపై ఆమెకు చాలా అంచనాలున్నాయి. ఎందుకంటే కలంక్‌, టోటల్‌ ధమాన్‌, మిషన్‌ మంగళ్‌ అనే మూడు ప్రతిష్టాత్మక చిత్రాల్లో సోనాక్షీ నటిస్తోంది. ఈ చిత్రాలు తనకు మంచి విజయాలు అందిస్తాయనే ఆమె ఆశిస్తోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa